Oct 15, 2024, 06:10 IST/బాన్సువాడ
బాన్సువాడ
బీర్కూర్: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆగ్రో చైర్మన్
Oct 15, 2024, 06:10 IST
బీర్కూర్ మండల కేంద్రంలో తిమ్మపూర్ సొసైటీ పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ పంటలను విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శంకర్, మాజీ ఎంపీపీ రఘు పాల్గొన్నారు.