
పెనుకొండ: రాష్ట్రాభివృద్ధిలో లోకేశ్ చెరగని ముద్ర
టీడీపీ యువ నాయకులు, మంత్రి నారా లోకేశ్ నిర్వహించిన యువగళం పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొచ్చిందని మంత్రి సవిత తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. మంత్రి లోకేశ్ చేపట్టిన చారిత్రాత్మక యువగళం పాదయాత్రకు నేటితో రెండేళ్లు గడిచిందన్నారు. ఏపీ రాజకీయ యవనికపై యువగళం పాత్ర చెరగని ముద్ర వేసిందని రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని మార్చేసిందని అన్నారు.