ద్రవ్యోల్బణం నియంత్రణలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీ సభలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తూ పెట్టుబడులను అడ్డుకుంటోందని ఆరోపించారు. ఇటువంటి కుట్రలు రాష్ట్రానికి హానికరమని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని అన్నారు.