
పెనుకొండ: భోగిమంటల్లో విద్యుత్ బిల్లలు దహనం
పెనుకొండ పట్టణంలోని తిమ్మాపురం గ్రామంలో సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లలను భోగిమంటల్లో దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తరువాత ఎలక్ట్రిసిటీ రెగ్యులేరిటీ కమిషన్ పేరుతో 15వేల కోట్ల రూపాయలు విద్యుత్ చార్జీలు ప్రజలపై భారాలు మోపిందని ఒకవైపు సంక్షేమ పథకాలు కుదించి మరోవైపు భారాలు వేయడం జరిగిందన్నారు.