

చిలమత్తూరు: దళిత స్మశాల వాటిక దారి కబ్జా చేసిన టీడీపీ నాయకుడు
చిలమత్తూరు మండలం సోమగట్ట గ్రామంలో దళిత స్మశాన వాటికకు టిడిపి నాయకుడు కబ్జా చేశారని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ తెలిపారు. సిపిఐ పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు వెంకటలక్ష్మమ్మ అనారోగ్యంతో మృతిచెందగా స్మశాన వాటికకు తీసుకెళుతుండూగా ఈ దారిలో వెళ్లడానికి వీలు లేదంటూ పోలీసుల సహకారంతో అడ్డుకోవడం చాలా దుర్మార్గమైన చర్య అని ఖండించారు. సిసి రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రహరీ గోడ నిర్మించి రక్షణ కల్పించాలని కోరారు.