పెనుకొండ పట్టణంలో వైసీపీ నాయకులతో కలసి మాజీ మంత్రి, నియోజకవర్గం సమన్వయ కర్త ఉషాశ్రీచరణ్ ఆదివారం పర్యటించారు. పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ లోని పోస్ట్ ఆఫీస్ ఎదురుగా టీ స్టాల్ వద్ద ఆమె కాఫీ త్రాగుతూ ప్రజలను పలకరించారు. ప్రజలతో మమేకమై ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.