పెనుకొండ పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద నుండి ప్రత్యేక రైలులో విశ్వహిందు పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో జరగనున్న హైందవ శంఖారావం బహిరంగ సభకు హిందూ సోదరులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్బంగా శనివారం స్థానిక రైల్వే స్టేషన్ లో మంత్రి సవిత జెండా ఊపి, హిందూ దేవాలయల పరిరక్షణ కోసం తల పెట్టిన హైందవ శంఖారావం సభ విజయవంతం కావాలని కోరారు.