మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకునిపెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పీసీసీ ఆదేశం మేరకు గత ఎన్నికల్లో అమలు చేయడానికి సాధ్యం కానీ హామీలు ఇచ్చి ఇప్పటివరకు వంద రోజులు పూర్తి అయిన కూడా ఒక్క హామీని కూడా నెరవేర్చని రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.