రొద్దం మండలం కోగిర గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ హై స్కూల్ లో గురువారం జాతీయ బాలల దినోత్సవంను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా పెనుకొండ బిజెపి సభ్యత్వం ఇంచార్జ్ గోపీనాథ్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని తెలిపారు. పిల్లలు బాగా చదివి అత్యున్నత స్థాయికి ఎదగాలని కలిసికట్టుగా స్నేహభావాన్ని పెంచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో హెచ్ ఎం, ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.