రొద్దంలోని శ్రీరొద్దకాంబకాదేవి దేవస్థానం పక్కన నిర్మాణంలో ఉన్న కళ్యాణమండపాన్ని హిందూపురం ఎంపీ బి. కే. పార్థసారథి శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా గత టీడీపీ ప్రభుత్వంలో టీటీడీ బోర్డు మెంబర్ గా పార్థసారథి టీటీడీ నిధులు రూ 85 లక్షలతో కళ్యాణ మండపం నిర్మాణం కోసం నిధులు తీసుకురాగా ప్రభుత్వం మారడంతో నిలిచిపోయిన భవన నిర్మాణ సముదాయాన్ని పరిశీలించి అందుకు కావాల్సిన నిధులు విడతల వారీగా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.