నేచురల్ బ్యూటీ, సినీ నటి సాయి పల్లవి పుట్టపర్తిలో సందడి చేశారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో నటి సాయి పల్లవి బుధవారం నూతన సంవత్సరాన్ని పుట్టపర్తి బాబా ఆలయంలో జరుపుకున్నారు. ఇవాళ ఉదయం ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహా సమాధిని దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలను తిలకించారు.