సత్యసాయి బాబా జన్మదిన వేడుకల ఏర్పాట్లు ప్రారంభం: ఎమ్మెల్యే

83చూసినవారు
పుట్టపర్తి మున్సిపాల్ కార్యాలయంలో గురువారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే పల్లె సింధుర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి కౌన్సిలర్ సహకారంతో పుట్టపర్తి అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. మున్సిపల్ కార్యాలయం కోసం తీమ్ పార్క్ వద్ద స్థలాన్ని పరిశీలించమన్నారు. అంతే కాకుండా నవంబర్ 23 న సత్యసాయి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్