ఓబులదేవర చెరువు ఐసిడిఎస్ ప్రాజెక్టులో చాలా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి నాయకులతో కలిసి సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి అక్రమాలపై పలు పత్రికలలో కథనాలుగా వచ్చిన కూడా సిడిపిఓ, సూపర్వైజర్ల విధినిర్వహణలో ఏమాత్రం మార్పు రాలేదన్నారు.