శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేడుకను రద్దు చేసినట్లు ఆదివారం జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. రేపటి నుంచి 16వ తేదీ వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక అధికారులు ఆయా మండలాల్లో ఉండాలని ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈ వారం రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.