జిల్లాలో నేరాలను నియంత్రించుటలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న మారుమూల ప్రాంతాలను ముందుగా గుర్తించి, ఆయా ప్రాంతాలపై నిఘా పెట్టేందుకు డ్రోన్స్ వినియోగిస్తున్నామని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వి. రత్న ఐపీఎస్ పేర్కొన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులకు డ్రోన్స్ ను ఎలా ఉపయోగించాలి అన్న వాటిపై నిపుణులు తెలియజేశారు.