శ్రీసత్యసాయి డి.ఎం&హెచ్ఓ ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మంజువాణి పాల్గొన్నారు. ఇందులో భాగంగా హైరిస్కు గ్రూపు వారికి, హెచ్ఐవి బాధితులకు రంగోలి ముగ్గుల పోటీలను నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులు అందించారు.