శ్రీసత్యసాయి జిల్లా ఓబుళదేవచెరువు మండలం చౌడంపల్లిలో ఓ యువతి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. అయితే ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్ఐ వంశీకృష్ణ వెల్లడించారు. తరుచూ ఫోన్ లో మాట్లాడుతూండగా ఆ యువతి ఇంట్లో తల్లిదండ్రులు మందలించారన్నారు. దీంతో ఆదివారం ఇంటి నుంచి వెళ్లిపోయిన యువతి.. సోమవారం గ్రామ సమీపంలోని చెక్ డ్యాం వద్ద శవమైతేలిందన్నారు.