కూటమి ప్రభుత్వం పాలనలో విఫలమైంది: మాజీ ఎమ్మెల్యే

71చూసినవారు
కూటమి ప్రభుత్వం పాలనలో విఫలమైంది: మాజీ ఎమ్మెల్యే
కూటమి ప్రభుత్వం పాలనలో విఫలమైందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి శుక్రవారం విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో తరచూ దాడులు జరుగుతున్నాయన్నారు. తమ ప్రభుత్వంలో అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను రద్దు చేశారని తెలిపారు. గతం కంటే ఎక్కువ ధరకు ఇసుక కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇసుక ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి టీడీపీ నాయకులకు సంపద సృష్టిస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్