గార్మెంట్స్ కు పూర్వ వైభవం తీసుకువచ్చేలా కృషి చేస్తా: కాలవ

58చూసినవారు
గార్మెంట్ కార్మికులకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా కృషి చేస్తానని రాయదుర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని 29వ వార్డులో మంగళవారం స్థానిక టిడిపి నాయకుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. గార్మెంట్ కార్మికుల పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు. తనకు ఎమ్మెల్యేగా అఖండ విజయాన్ని అందించాలని కోరారు. టెక్స్టైల్ పార్కు తీసుకొచ్చిన ఘనత తనదేనన్నారు.

సంబంధిత పోస్ట్