VIDEO: విమానంలో పొగలు.. గాయపడ్డ ప్రయాణికులు

52చూసినవారు
దక్షిణ అమెరికా లోని వెనుజులా లో ఘోర ప్రమాదం జరిగింది. లేజర్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రయాణికులకు ఊహించని షాక్ తగిలింది. వారు ప్రయాణిస్తున్న విమానంలో పొగలు ఒక్కసారిగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో ప్రయాణికులు అత్యవసర స్లైడ్‌ ద్వారా విమానం నుంచి బయటపడే క్రమంలో తీవ్రంగా గాయపడ్డారు. విమానంలో 91 మంది ప్రయాణికులు ఉన్నారు. పొగలు గుర్తించిన సిబ్బంది వెంటనే ప్రయాణికుల్ని అప్రమత్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్