రాష్ట్ర డీజీపీ తో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు భేటీ

67చూసినవారు
రాష్ట్ర డీజీపీ తో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు భేటీ
విజయవాడలో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావును రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. అనంతరం నియోజకవర్గ సమస్యలపై చర్చించారు. ఐదు పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని ఆయనకు వివరించారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో భద్రతకు ఇబ్బందిగా ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్