రాయదుర్గం: నీటి తొట్టెలో పడి బాలుడు మృతి

52చూసినవారు
రాయదుర్గం: నీటి తొట్టెలో పడి బాలుడు మృతి
గుమ్మఘట్ట మండలం బిటిపి గ్రామంలో నీటి తొట్టెలో పడి 6 ఏళ్ల బాలుడు మృతి చెందిన విషాదకర సంఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వన్నూరప్ప, జ్యోత్స్నల ఏకైక కుమారుడు రామకిషోర్ సోమవారం సాయంత్రం ఆడుకుంటూ ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఉన్న నీటి తొట్టిలో పడి మృతి చెందాడు. మధ్యాహ్నం నుంచి బాలుడు కనిపించకపోవడంతో బాలుడి ఆచూకి కోసం వెతికారు. అయితే చివరికి నీటితొట్టెలో పడి శవమై కనిపించాడు.

సంబంధిత పోస్ట్