రాయదుర్గం: ఆంజనేయస్వామికి పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి

64చూసినవారు
బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీ ఆంజనేయస్వామి వారిని శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. ఆంజనేయ స్వామికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ వారు ముఖ్యమంత్రికి ఘనంగా సన్మానం చేసి ఆంజనేయ స్వామి పటాన్ని అందజేశారు. కార్యక్రమంలో అధికారులు, ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, కలెక్టర్, టిడిపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్