రాయదుర్గం: పరిమితికి మించి ప్రయాణికులతో వాహనాలు నడపకూడదు

70చూసినవారు
రాయదుర్గం: పరిమితికి మించి ప్రయాణికులతో వాహనాలు నడపకూడదు
రాయదుర్గం మండలం వివిధ పాఠశాలలకు మండలంలోని పల్లెల నుంచి వచ్చే ఆటోల్లో డ్రైవర్లు, చిన్నారులను పరిమితికి మించి ఎక్కిస్తున్నారని గ్రామస్తులు బుధవారం విలేఖరులకు తెలిపారు. ఎంత ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే అంత ఎక్కువ మొత్తం వస్తుందన్న ఆశతో కొందరు డ్రైవర్లు ఇలా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థుల పాఠశాల సమయానికి అనుకూలంగా బస్సులు ఉండే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్