సమాజమంటే సాటి మనిషిని ఆదరించడం: ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు

83చూసినవారు
సమాజమంటే సాటి మనిషిని ఆదరించి ప్రేమించి కష్టాల్లో ఉన్న సాటి మనిషికి అండగా నిలబడడమేనని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం రాయదుర్గం పట్టణంలోని అన్వరుల్ ఉలుమ్ మధరసాలో మైనారిటీ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మద్రాసాలో దాదాపు 85మంది విద్యార్థులు ఖురాన్ విద్యను నేర్పిస్తూ వారు ఒక మంచి జీవితానికి అలవాటు పడే విధంగా బలమైన పునాదులు వేయడం హర్షదాయకమన్నారు.

సంబంధిత పోస్ట్