నార్పల మండలం గూగూడులో వెలసిన శ్రీ కుళ్లాయిస్వామి దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకల హుండీలను ఆలయ కార్యనిర్వహణ అధికారి సాకేతపురం శోభ ఆధ్వర్యంలో శుక్రవారం లెక్కించారు. హుండీల ద్వారా ఆలయానికి రూ. 16, 53, 160 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.