పుట్లూరు మండలంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న హేమాద్రి గురువారం బదిలీ కావడంతో ఆయనను పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈయన తిరుపతి వీఆర్ కు వెళ్లగా అక్కడి నుంచి వెంకటనరసింహన్ ఇక్కడికి బదిలీ అయ్యారని పోలీసులు తెలిపారు. కాగా బదిలీపై వెళ్లిన హేమాద్రిని పూలమాలతో సన్మానించి ఆయన సేవలను సిబ్బంది కొనియాడారు.