శింగనమల: ‘చర్మంపై అలాంటి మచ్చలు ఉంటే వైద్యులను సంప్రదించండి'

55చూసినవారు
శింగనమల: ‘చర్మంపై అలాంటి మచ్చలు ఉంటే వైద్యులను సంప్రదించండి'
శింగనమల మండలం తరిమెల గ్రామ వైద్య అధికారి డాక్టర్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో కుష్టు వ్యాధి సర్వేపై శుక్రవారం ప్రజలకు ఇంటింటికీ తిరుగుతూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ. వ్యాధికి సంబంధించిన రాగి రంగు మచ్చలు, స్పర్శ లేని మచ్చలు ఉన్నాయేమోనని ఆశా వర్కర్లతో ఈ సర్వే చేస్తున్నామన్నారు. అలాంటి మచ్చలు ఉంటే స్థానిక వైద్య అధికారులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.

సంబంధిత పోస్ట్