శింగనమల నియోజకవర్గ పరిధిలోని రబీ సీజన్ లో టమాట పంట సాగు చేసిన రైతులు బీమా ప్రీమియం కింద తమ వాటా చెల్లించాలని శనివారం ఉద్యాన శాఖ అధికారి శైలజ పేర్కొన్నారు. వాతావరణ బీమా కింద టమాటాను నోటిఫై చేశారని. ఈ-క్రాప్ నమోదుతో పాటు ఎకరాకు రూ. 1, 600 ప్రకారం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందన్నారు. డిసెంబర్ 15వ తేదీ చివరి గడువు అని తెలిపారు. టమోటా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.