తాడిపత్రి: ప్రమాదవశాత్తు కిందపడి కార్మికుడు మృతి

53చూసినవారు
తాడిపత్రి: ప్రమాదవశాత్తు కిందపడి కార్మికుడు మృతి
తాడిపత్రి రూరల్ పరిధిలో భవనంపై నుండి కార్మికుడి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. రూరల్ పరిధిలోని పోతులయ్య పాలెంలో నాలుగో అంతస్తులో పనిచేస్తున్న బేల్దారి షేక్షావలి ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్