అనంతపురంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పార్కింగ్‌లో గురువారం తెల్లవారుజామున మంటలు చెలరేగి వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో జేసీ దివాకర్ రెడ్డికి చెందిన రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పారు. బస్సుల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.