తాడిపత్రిలో చైన్ స్నాచర్ అరెస్ట్

73చూసినవారు
తాడిపత్రిలో చైన్ స్నాచర్ ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పట్టణంలోని సీపీఐ కాలనీలో వృద్ధురాలు రంగమ్మ మెడలో ఉన్న 3 తులాల బంగారు గొలుసును గత నెల 15న దోచుకెళ్లారు. పక్క సమాచారంతో సీఐ సాయి ప్రసాద్ బైక్ పై వస్తున్న మహేశ్ ను అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. 3 తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. బైక్ ను కూడా స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్