చౌక ధాన్యపు వేయింగ్ మిషన్ లు తనిఖీ

71చూసినవారు
చౌక ధాన్యపు వేయింగ్ మిషన్ లు తనిఖీ
యాడికి మండల కేంద్రంలోని చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం 50 చౌక ధాన్యపు వేయింగ్ మిషన్లను తూనికలు కొలతల అధికారి శంకర్ తనిఖీ చేశారు. అనంతరం సూపర్ మార్కెట్లను తనిఖీ చేశారు. ఓ సూపర్ మార్కెట్ లో వేయింగ్ మిషన్ కు సీలు లేకపోవడంతో పదివేలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా తూనికలు కొలతల అధికారి మాట్లాడుతూ వేయింగ్ మిషన్లు సక్రమంగా లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్