తాడిపత్రి: రథోత్సవాన్ని తిలకించడానికి భారీగా తరలివచ్చిన భక్తులు

54చూసినవారు
తాడిపత్రి పట్టణంలోని శ్రీ చింతల వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం స్వామివారికి కళ్యాణం నిర్వహించారు. అనంతరం సాయంత్రం ఉత్సవ విగ్రహాలను రథం లో ఏర్పాటు చేసి పట్టణంలోని గాంధీ కట్ట వద్ద నుంచి స్వామి వారిని మెయిన్ బజార్ మీదుగా ఆంజనేయస్వామి విగ్రహం వరకు రథంపై ఊరేగించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్