పెన్షన్ల వయస్సులో డప్పు కళాకారులకు మినహాయింపు ఇవ్వాలని దక్షిణ భారత మాదిగ హక్కుల దండోరా అధ్యక్షుడు ఈశ్వరయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఆదివారం తాడిపత్రి పట్టణ కేంద్రంలోని హరిజనవాడలో డప్పు కళాకారుల సమావేశం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్మకారులు, డప్పు కళాకారులకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చి, కార్పొరేషన్ల ద్వారా వ్యక్తిగత రుణాలు మంజూరు చేసి కళాకారులను ఆదుకోవాలని ఆయన అన్నారు.