తాడిపత్రి మండలంలోని చుక్కలూరు సమీపంలో పేకాట ఆడుతున్న ముగ్గురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ. 1, 550 స్వాధీనం చేసుకున్నామని అప్ గ్రేడ్ సీఐ శివ గంగాధర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. అందిన సమాచారం మేరకు దాడులు చేసి. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.