తాడిపత్రిలో వినాయకుడి లడ్డూ వేలం పాట

573చూసినవారు
తాడిపత్రి పట్టణంలోని కేవీ రెడ్డి నగర్ లో మంగళవారం జరిగిన గణేశుడి లడ్డు వేలంలో భారీ ధర పలికింది. గ్లోరీ ఆఫ్ గణేశ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 21 కిలోల వినాయకుని లడ్డును వేలం నిర్వహించగా మనోజ్ రెడ్డి, కీర్తిరెడ్డి అనే స్నేహితులు రూ. 1, 42, 100లకు సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నితీష్ కుమార్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్