తాడిపత్రి పోలీసులపై జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా 2023లో ఇచ్చిన ఫిర్యాదులపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేవని అన్నారు. డీఎస్పీ కేసు కట్టవద్దని ఎస్ఐకు చెప్పినట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. గతంలో లాగా ఇప్పుడూ చేయాలంటే కుదరదన్నారు. ప్రజల కోసం పనిచేయాలని తప్పు చేసిన వారికి శిక్ష పడాలని స్పష్టం చేశారు.