యాడికి మండల కేంద్రంలోని కుంటలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఒకరిని శనివారం అరెస్టు చేసి 15 క్వార్టర్ల మద్యం ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఈరన్న తెలిపారు. కుంటలో శ్రీరంగ అనే వ్యక్తి అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేశామన్నారు. అనంతరం అతడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.