గంజాయి వాడకంపై పార్టీలకు అతీతంగా ఖండించాలి: జెసి

61చూసినవారు
గంజాయి వాడకంపై పార్టీలకు అతీతంగా అందరూ ఖండించాలని మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి గురువారం పేర్కొన్నారు. గంజాయి వాడకం వల్ల తాడిపత్రి చెడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పంజాబ్ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా ఉండేదని, పాకిస్తాన్ సరిహద్దు వల్ల గంజాయి డ్రగ్స్ అలవాటు చేశారని, రాజకీయ నాయకులు గంజాయిని కూకటివేళ్లతో తొలగిస్తామని చెప్పినా కష్టంగా ఉందన్నారు. తాడిపత్రి ప్రజలందరూ కలిసి గంజాయిని అరికట్టడానికి ముందుకు రావాలన్నారు.

సంబంధిత పోస్ట్