పెద్దవడుగూరు: రేపు సోలార్ ప్రాజెక్ట్ ఎదుట ధర్నా

77చూసినవారు
పెద్దవడుగూరు: రేపు సోలార్ ప్రాజెక్ట్ ఎదుట ధర్నా
పెద్దవడుగూరు మండలంలోని సోలార్ ప్రాజెక్ట్ ఎదుట ఈనెల 7వ తేదీ ధర్నా నిర్వహిస్తున్నామని ఎమ్మార్పీఎస్ అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి. ఆదినారాయణ మాదిగ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ లేబర్ చట్టం ప్రకారం కూలీలకు వేతనాలు, భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు ఉద్యోగాల మంజూరు, తదితర సమస్యల పరిష్కారానికి మండల ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి ధర్నా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్