పెద్దపప్పూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ శకుంతల గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు జరగనున్న సమావేశానికి జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని ఆమె కోరారు.