అనంతపురం జిల్లాకు చెందిన అనిల్ కుమార్ శనివారం ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఫుట్బాల్ ఇండియా జట్టుకు ఎంపికయ్యారు. విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో, పెద్దపప్పూరు మండలంలోని కుమ్మెత సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న అనిల్ కుమార్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. త్వరలో గోవాలో జరిగే పోటీల్లో పాల్గొంటానని తెలిపారు.