పెద్దపప్పూరు: భక్తి శ్రద్ధలతో గ్యార్మీ పండుగ వేడుకలు

84చూసినవారు
పెద్దపప్పూరు: భక్తి శ్రద్ధలతో గ్యార్మీ పండుగ వేడుకలు
పెద్దపప్పూరు మండల కేంద్రంలోని చాగల్లు గ్రామంలోని దస్తగిరి స్వామిని ప్రత్యేకంగా అలంకరించి మంగళవారం నిర్వాహకులు గ్యార్మీ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మేళతాళాలు, డప్పుల శబ్దాల నడుమ స్వామి వారిని గ్రామ వీధులలో ఊరేగింపుగా వెళ్లి ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల సీపీఐ కార్యదర్శి చింతా పురుషోత్తం తదితరులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్