పెద్దపప్పూరు మండలంలోని చిన్నపప్పూరు గ్రామ సమపంలో పెన్నానది ఒడ్డున వెలసిన అశ్వత్థ నారాయణస్వామి క్షేత్రంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామి కల్యాణోత్సవం అర్చకులు ఘనంగా నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా నారాయణస్వామి, చక్ర భీమలింగేశ్వరులను దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఈఓ సుబ్రమణ్యం, ఆలయ సిబ్బంది అరుణ్ కుమార్, గురప్ప, రాఘవ సౌకర్యాలు కల్పించారు.