పెద్దపప్పూరు మండలం జూటూరు రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే వంతెన కింద రహదారిపై బియ్యం బస్తాలు తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. సుంకేసులపల్లికి చెందిన పలువురు నంద్యాల జిల్లా అవుకులో బియ్యం బస్తాలను కొనుగోలు చేసి పురుషోత్తంరెడ్డికి చెందిన ట్రాక్టర్ లో స్వగ్రామానికి తరలిస్తుండగా రైల్వే వంతెన కింద రహదారిపై నీరు నిలిచి ఉండడంతో పాటు గొయి పడింది. ఆ గొయి కన్పించపోవడంతో ట్రాక్టర్ టైరు వెళ్లి బోల్తాపడింది.