పెద్దవడుగూరు మండల కేంద్రంలో విద్యుదాఘాతంతో విద్యుత్ స్తంభం పైనుంచి కిందపడి చింతలచెరువు గ్రామానికి చెందిన నగేష్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. నగేష్ దినసరి కూలీగా విద్యుత్ మరమ్మత్తు పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. కాగా సోమవారం మండలకేంద్రంలో విద్యుత్ స్తంభాలకు వీధిలైట్లు ఏర్పాటు చేసే క్రమంలో విద్యుత్ షాక్ తగలడంతో స్తంభం నుంచి జారిపడి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.