తాడిపత్రి సర్వజన ఆసుపత్రి మెడికల్ అధికారికి మంగళవారం సీఐటీయూ నాయకులు వినతిపత్రం అందించారు. సచివాలయాల మ్యాపింగ్ లో భాగంగా 15 ఏళ్లుగా పనిచేస్తున్న ప్రాంతంలోని ఆశా వర్కర్లను కొనసాగించాలని, నాణ్యత లేని 3జి ఫోన్లు ఇచ్చి 7 అప్లికేషన్లు పెట్టడంతో ఆశా వర్కర్లకు పనిభారం పెరిగిందని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్లను నియమించాలన్నారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని కోరారు.