తాడిపత్రిలో నేడు విద్యుత్ అంతరాయం వాటిల్ల నున్నట్లు విద్యుత్ అధికారులు శుక్రవారం పేర్కొన్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా పట్టణంలోని టైలర్స్ కాలనీ, కృష్ణాపురం రోడ్డు, పుట్లూరు రోడ్డులలో ఉదయం 8 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అంతరాయం వాటిలనున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.