తాడిపత్రి పట్టణంలో రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వెంకటరమణమూర్తి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రాచీన ఆలయాలైన శ్రీ బుగ్గరామలింగేశ్వరస్వామి క్షేత్రం, శ్రీచింతల వెంకటరమణస్వామి దేవస్థానాలను కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు వేదమంత్రోచారణలు నడుమ ఘన స్వాగతం పలికి దర్శనం చేయించారు. తాడిపత్రిలో శిల్ప కళా సంపద చాలా బాగుందన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యు లు చంద్రమోహన్ పాల్గొన్నారు.